షారుఖ్‌కు అకాడమీ గౌరవం.. 'ఓం శాంతి ఓం' డైలాగ్పై ప్రశంస
- తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఓం శాంతి ఓం' క్లిప్‌ను షేర్ చేసిన అకాడమీ
- షారుఖ్ చెప్పిన ఫేమస్ డైలాగ్‌ను క్యాప్షన్‌లో పెట్టి ప్రశంస
- 2007 నాటి ఈ సినిమాతోనే దీపికా పదుకొణె అరంగేట్రం
- 'జవాన్' చిత్రానికి గాను ఇటీవల షారూఖ్‌కు జాతీయ అవార్డు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గ్లోబల్ స్టార్‌డమ్‌ను ప్రతిష్ఠాత్మక అకాడమీ (ఆస్కార్) మరోసారి గుర్తించింది. ఆయన నటించిన క్లాసిక్ ఫిల్మ్ 'ఓం శాంతి ఓం'లోని ఓ ఐకానిక్ వీడియో క్లిప్‌ను అకాడమీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది.
ఈ వీడియోలో షారుఖ్ చెప్పిన "ఇత్నీ షిద్దత్ సే మైనే తుమ్హే పానే కీ కోషిష్ కీ హై..." అనే డైలాగ్ ఉంది. దీనికి అకాడమీ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించింది. "విధి గురించి ఒక విషయం... అది ఎప్పటికీ దారి తప్పదు" అని పేర్కొంటూ ఈ చిత్రం వివరాలను పంచుకుంది. ఫరాఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుఖ్ ద్విపాత్రాభినయం చేయగా, దీపిక పదుకొణె హీరోయిన్గా అరంగేట్రం చేశారు.
2007లో విడుదలైన 'ఓం శాంతి ఓం' ప్రేమ, పునర్జన్మ, ప్రతీకారం వంటి అంశాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీపై సెటైర్‌తో పాటు, సినిమాకు నివాళిగా ఈ చిత్రాన్ని రూపొందించారు. నాటి తరం సినిమా సెట్లు, డ్రామా, పాటలతో ఈ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయం సాధించింది.
ఇక షారుఖ్ కెరీర్ విషయానికొస్తే, గతేడాది 'జవాన్' చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలోని నటనకు గాను ఆయన '12th ఫెయిల్' నటుడు విక్రాంత్ మాస్సీతో కలిసి ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'కింగ్' అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు.